స్వచ్ఛ్ భారత్ మిషన్ అకాడమీ ప్రారంభం 

ప్రవర్తన మార్పు ప్రచారంలో భాగంగా ‘గందగి ముక్త్ భారత్’ లో జల్ శక్తి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్మం గళవారం స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని ప్రారంభించారు. ఐవిఆర్ టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి, ఎస్‌బిఎం అకాడమీ స్వాగత సందేశాన్ని వినడం ద్వారా గజేంద్ర సింగ్ షేఖావత్ దీనిని ఆవిష్కరించారు. 
 
పరివర్తనను నిలకడగా కొనసాగించడానికి, స్వచ్ఛగ్రాహిలు, ఇతర క్షేత్రస్థాయి కార్యకర్తల వంటి ముఖ్య వాటాదారుల సామర్థ్యాన్నిపెంపొందించడానికి, ఎస్‌బిఎం (జి) 2 వ దశలో ప్రముఖంగా ప్రస్తావించిన లక్ష్యాలను సాధించడంలో ఓడిఎఫ్ ప్లస్ పై ఈ ఐవిఆర్ ఆధారిత ఉచిత మొబైల్ ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సు కీలకమైనది.
 
ప్రపంచం ఇప్పటివరకు చూడని విధంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ) గ్రామీణ భారతదేశాన్ని పారిశుద్ధ్యం కోసం ఒక ప్రజా ఉద్యమంగా మారిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఇది 2019 అక్టోబర్ 2 న అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) ప్రకటనను చారిత్రాత్మకంగా సాధించడానికి దారితీసింది పేర్కొన్నారు. 
 
దీని ద్వారా గ్రామీణ భారతదేశం ఓడిఎఫ్ గా మార్చింది. అసాధారణ విజయాన్ని ముందుకు తీసుకెళ్లి,  ఎస్‌బిఎం (జి)  రెండవ దశ ఈ సంవత్సరారంభంలో ప్రారంభమైంది. ఇది ఓడిఎఫ్ స్థిరత్వం, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఎస్ఎల్డబ్ల్యూఎం) పై దృష్టి పెడుతుంది. 
 
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అవకాశం ఇస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ తన మొబైల్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో స్వచాగ్రహిలతో పాటు పిఆర్ఐ సభ్యులు, సామజిక సంస్థలు, ఎన్జిఓలు, స్వయం సహాయక సంఘాలు,  ఎస్‌బిఎం (జి)తో సంబంధం ఉన్నవారి ద్వారా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.