మూడు రాజధానుల అవినీతిపై బీజేపీ పోరాడాలి 

నాడు చంద్రబాబు హయాంలో అమరావతి అవినీతిపై ప్రశ్నించామని గుర్తు చేస్తూ,  ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపిచ్చారు. న్నారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలని సూచించారు.   
. విజయవాడలో బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు పదవీ, బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో మోదీ ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ ఈ అంశంలో కేంద్రం తన పరిధిలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందతెలిపారు. 
చంద్రబాబు ప్రభుత్వ సమయంలో ఎలా ఉందొ, ఇప్పుడు రాష్ట్ర పరిధి అంశాలపై అలానే కేంద్రం అదే విధంగా ఉన్నదని చెప్పారు. ‘రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకోలేదు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడు జోక్యం చేసుకోలేదు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని’’ రామ్‌మాధవ్ పేర్కొన్నారు.
 
అంటే దీనర్థం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పార్టీ   ప్రశ్నించకూడదని కాదని తేల్చి చెప్పారు. నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని, అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు. 
అయితే, ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉన్న కారణంగా. 
 
రాష్ట్రంలో మూడు రాజధానులనేవి అవినీతికి ఆలవాలం కాకుండా.. అమరావతి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా ఎదగాలని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు సూచించారు. 
 
రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని కోరారు. ‘‘మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారు. హైదరాబాద్‌లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్‌ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని’’ రామ్‌మాధవ్‌ విమర్శించారు.  
 
ఇన్నాళ్లూ జూనియర్ పాట్నర్‌గా పోషించిన పాత్ర నుంచి బయటకు రావాలని రాష్ట్రంలోని బిజెపి నాయకులకు సూచించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, విమర్శనాత్మక మిత్రత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే నాలుగేళ్లలో బలమైన శక్తిగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. 
 
‘‘మోదీ మరో పది, పదిహేనేళ్ల ఉండొచ్చు. కానీ అది ఏపీ బీజేపీకి సరిపోదు. మంచి అవకాశాన్ని బీజేపీ కార్యకర్తలు ఉపయోగించుకోవాలి” అంటూ హితవు చెప్పారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వ వైఖరిని మనం గమనిస్తున్నామని చెబుతూ ఆ వైఖరిని కూడా ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు. 
అధికార పార్టీ దురహంకారాన్ని ఎదుర్కోవాలని అంటూ అధికారంలో ఉన్న వ్యక్తులను సంఘర్షణ వైఖరితో ఎదుర్కోవాలని అంటూ ప్రజా పోరాటాలపై దృష్టి సారింపమని సంకేతం ఇచ్చారు. ప్రతిసారీ ఢిల్లీకి ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. “ఢిల్లీ ఏం చేయాలో అది చేస్తుంది. ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగా వీధుల్లో నిలబడి పోరాడాలి. ఏపీలో అప్పుడే ముందుకు వెళ్లగలం. ప్రజల కోసం నిలబడే పార్టీగా ఎదగాలి’’ అని హితబోధ చేశారు.