ఆక్లాండ్లోని రాధా క్రిషన్ ఆలయాన్ని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ సందర్శించారు. ఆర్డెర్న్ ఆలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో నెటిజెన్లు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ఆక్లాండ్ లోని రాధాక్రిషన్ ఆలయానికి వచ్చిన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ కారు దిగగానే పాదరక్షలు విడిచి అక్కడున్నవారిని నమస్తే అంటు పలకరించింది. అనంతరం గుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం కొనసాగినంతసేపు జసిండా చేతులు ముడుచుకుని నిలబడింది.
పూజ అనంతరం ఆమెకు పూజారి పవిత్రవస్త్రాన్ని అందజేసి దీవించారు. ఆలయంలో ప్రసాదంగా ఇచ్చిన పూరీ చోలేను తిని సంతోషం వ్యక్తం చేశారు. రాధాక్రిషన్ ఆలయానికి జసిండా వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని మతాలను గౌరవించే నాయకురాలుగా ఆర్డెర్న్ను నెటిజన్లు ప్రశంసించారు.
మరొకరు “ఆమె నిజంగా గొప్ప నాయకురాలు. మందిర్, మసీదు, చర్చిని సందర్శించినా.. ఆమె కార్యకలాపాలు మాత్రమే ఆమె ప్రపంచ చరిత్రలో గొప్ప నాయకులలో ఒకరిని చూపిస్తుంది” అని కొనియాడారు.
న్యూజిలాండ్ లో సెప్టెంబరులో ఎన్నికలు జరుగనున్నాయి. లేబర్ పార్టీ ఎన్నికల లెక్కల ప్రకారం ఆర్డెర్న్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు.

More Stories
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు