య‌థాత‌థ స్థితి నెల‌కొంటేనే ద్వైపాక్షిక బంధం  

సరిహద్దుల్లో య‌థాత‌థ స్థితి నెల‌కొంటేనే భార‌త్‌-చైనా ద్వైపాక్షిక బంధం కొన‌సాగుతుంద‌ని చైనాకు భార‌త్ తేల్చిచెప్పింది. చైనా స‌రిహ‌ద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు భారత సేనలు తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంబడే ఉంటాయని స్ప‌‌ష్టంచేసింది. 

చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కొన‌సాగాలంటే తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20కి ముందున్న పరిస్థితులు నెలకొనాలని భారత్‌ షరతు విధించింది. చైనాకు భార‌త్ పలుమార్లు ఇదే విషయం స్పష్టం చేసినా ఆ దేశం మాత్రం సంప్రదింపుల పేరుతో సరికొత్త ఎత్తులు వేస్తూ వ‌స్తున్న‌ది.

చైనా దూకుడుకు బ్రేక్ వేయ‌డం కోసం భారత్‌ ఇప్పటికే ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. 100కు పైగా చైనా యాప్‌లపై నిషేధం విధించింది. ప్రభుత్వ కాంట్రాక్టులు బీజింగ్‌కు దక్కకుండా నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది.

అయితే, భారత్‌ పలు రకాలుగా ఒత్తిడి పెంచుతున్నా డ్రాగన్‌ దారికి రాకపోగా సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇండో-చైనా ప్రతిష్టంభన సమసిపోయిందని, లడఖ్‌లో సేనల ఉపసంహరణ పూర్తయిందని ప్రపంచాన్ని నమ్మబలుకుతున్న‌ది.