
ప్రముఖ టాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని చిరు ఇంటికి వెళ్లిన ఆయన చిరుతో భేటీ అయ్యారు.
బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోమును మెగాస్టార్ అభినందించారు. ఈ సందర్భంగా పుష్పమాల, శాలువాతో వీర్రాజును చిరంజీవి సత్కరించారు. అనంతరం పలు విషయాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించారు.
More Stories
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం
న్యాయస్థానాల పరిధిలో హైకోర్టు తరలింపు అంశం
బీజేపీలో చేరిన కీలక జనసేన నేత