అయోధ్య భూమి పూజకు 1.11 లక్షల లడ్డూలు

అయోధ్య రామ మందిరం భూమి పూజకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ  భూమి పూజ చేయనున్న సందర్భంగా, ఆ రోజు భక్తులకు లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 1,11,000 లడ్డూలను తయారు చేస్తున్నారు. 

శనగపిండి, దేశీ నెయ్యి, క్రిస్టల్ షుగర్ తో తయారు చేస్తున్న ఈ లడ్డూలను స్టీల్ టిఫిన్ బాక్సులలో పెట్టి, భక్తులకు అందజేయనున్నారు. 200 మంది అతిథులకు సరిపడేలా వాటర్ ప్రూఫ్ పందిరి వేస్తున్నారు. ఇక భూమి పూజ రోజున అమెరికా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఇంగ్లిష్, హిందీలలో ‘‘జై శ్రీరాం” షోనూ టెలికాస్ట్ చేయనున్నారు.

రామ మందిరం భూమి పూజ కోసం ఈనెల 5న ఉదయం 11.15కు ఆయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ  వెళ్లనున్నారు. అక్కడనే సుమారు 3 గంటల పాటు గడుపుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా హనుమాన్ గరికి వెళ్తారు. తర్వాత భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

వేదికపై ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామ్ మందిర్ ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఉండనున్నారు. కాగా, ఈ లడ్డులను ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు సహితం పంపుతున్నారు.