త్వరలో హిందీ, కన్నడ భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలను దేశవ్యాప్తంగా ప్రసారం చేయాలని తిరుమల, తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అన్నమయ్య భవన్ లో బీర్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో పిల్లలు, యువతలో ధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయాలని నిర్ణయించారు.
ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ ఛానెల్‌గా మార్చాలని, ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళాలను స్వీకరించాలని సమావేశం నిర్ణయించింది. త్వరలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని, శ్రీవారి కళ్యాణోత్సవ సేవను త్వరలోనే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
కళ్యాణోత్సవ టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల ఇళ్లకు శ్రీవారి ప్రసాదం, అక్షింతలు తదితర పూజా సామగ్రి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
కాగా, శ్రీవారి దర్శనంకు సంబంధించి భక్తుల సంఖ్యను పెంచమని, యధాస్థితినే కొనసాగిస్తామని టిటిడి త్రుటిస్తే బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా బారిన పడిన ఒక్క అర్చకుడు మినహా మిగతా అందరు కోలుకున్నారని, ఆ అర్చకుడుకు కూడా త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలోనే కోలుకున్న అర్చకులంతా విధుల్లో కూడా చేరుతారని, కల్యాణోత్సవ ఆన్ లైన్ సేవను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఆన్ లైన్ లో భక్తులు కల్యాణోత్సవంను తిలకించవచ్చని, కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను అందజేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.
More Stories
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
ఒకేరోజు 13,326 గ్రామసభలతో ఏపీ ప్రపంచ రికార్డు