
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. అయినా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లాక్ డౌన్ విధించే పరిస్ధితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులు ఇచ్చినందున సినిమా రంగానికి కూడా మినహాయింపులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.
దీంతో వివిధ సినీ పరిశ్రమల నుంచి వస్తున్న ఒత్తిడితో కేంద్ర సమాచార, ప్రసారశాఖ హోం మంత్విత్వశాఖకు ఓ లేఖ రాసింది. తాజా పరిస్ధితుల క్రమంలో ఆగస్టు నెలలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లు తిరిగి ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని లేఖలో సమాచార ప్రసారశాఖ హోంశాఖను కోరింది.
అయితే ఆగస్టు 1 నుంచి వీటిని ప్రారంభించాలా లేక మధ్యలో ఎప్పుడైనా ప్రారంభిస్తారా అన్నది హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అమిత్ ఖారే తెలిపారు. సినిమా హాళ్లను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తాము హోంశాఖను కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
ఒకవేళ ఆగస్టులో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైనా లేటెస్టు సిఫార్సుల ప్రకారం సీట్ …సీట్ కు మధ్య గ్యాప్ ఉండేలా, ఓ వరుసకూ, వరుసకూ మధ్య గ్యాప్ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. భౌతిక దూరంతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు అన్నీ పాటించేలా థియేటర్స్, మాల్స్ పై నియంత్రణ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!