చైనా దూకుడుకు భారత్ నాయకత్వం కళ్లెం 

చైనా దూకుడుకు భారత్ నాయకత్వం కళ్లెం 

లెఫ్టనెంట్ జనరల్ చెరిష్ మాత్సన్

సరిహద్దుల నుండి ఆర్థిక మార్కెట్ల వరకు ధృడమైన నాయకత్వం, భారతదేశం అనుసరించిన బహుముఖ, కఠినమైన వైఖరి కారణంగా 2020 మే ఆరంభం నుండి ప్రారంభించిన దూకుడును చైనా తగ్గించుకోవలసి వచ్చింది.  వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంట చైనా ముప్పును ఎదుర్కోవటానికి భారత సైన్యాన్ని సమానంగా మోహరింపగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  లేహ్ ను సందర్శించి చైనాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

విస్తరణవాది జి జిన్‌పింగ్ చైనాను ఓడించాల్సిన అవసరం వస్తే రక్తపాతంతో పోరాడటానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన గట్టిగా చెప్పడం కన్నా మరింత నిజాయితీగా మరేమి ఉండకపోవచ్చు. ఇది వ్యూహాత్మక ప్రయోజనాలకు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి, అధిగమించడానికి ప్రపంచానికి భారత సంకల్పాన్ని చూపించింది.

ప్రధాన మంత్రి తన పదవీకాలంలో రెండో సారి చైనా సేనలను వెనుకకు పంపారు. మొదట 2017లో డొక్కలం వద్ద, ఇప్పుడు లడఖ్ వద్ద. దాదాపు ప్రతి రంగంలో బీజింగ్ విస్తరణ, దోపిడీ విధానాలను తట్టుకొనే విధంగా తన సహచరులు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ లతో కలసిప్రధాన మంత్రి చైనా విధానాన్ని రూపొందిస్తున్నట్లున్నది .

చైనీస్ మూలాల యాప్ లను నిషేధించడం నుండి, భారతదేశం సాంకేతిక, విద్యుత్ రంగంలో చైనా పెట్టుబడిదారులకు నిరోధించడం వరకు, చైనా తన స్వేచ్ఛా మార్కెట్‌ను ఉపయోగించనివ్వకూడదని భారతదేశం నిశ్చయించుకున్నట్లు కనిపిస్తున్నది. చైనా వ్యతిరేక విధానాలకు అవలంబించడం ద్వారా, ప్రధాని మోదీ సైనిక, దౌత్య, ఆర్థిక రంగాలలో సంక్లిష్టమైన లక్ష్యాన్ని చేపట్టారు.

గాల్వాన్ లోయ, తూర్పు లడఖ్ లోని ఇతర ప్రాంతాల నుండి చైనా తన సేనలను ఉపసంహరింప చేసుకోవడం దీర్ఘకాలిగా సంక్లిష్ట ప్రక్రియకు ప్రారంభంగానే చూడవచ్చు. వాస్తవ నియంత్రణ రేఖ అంతటా ఇది పూర్తిగా జరగాలని, తీవ్రతరం కావాలని భారతదేశం భావిస్తున్నది. 

భారత్, చైనాల మధ్య అనేక రౌండ్ల సైనిక, దౌత్య సమావేశాల తరువాత, ముఖ్యంగా జూన్ 15న రెండు వైపులా రక్షపు ఘర్షణలు జరిగిన గాల్వన్ లోయ సంఘటన తరువాత ఈ పరిణామం చోటుచేసుకొంది. మైదానంలో సైనిక కమాండర్ల మధ్య తీవ్రమైన చర్చల నేపథ్యంలో సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ చర్చలు జరిపారు,

వాంగ్మ, దోవల్ మధ్య రెండు గంటల సుదీర్ఘ చర్చలో బీజింగ్ తన సేనలను తగ్గించుకోవాలని ఒప్పించి, సరిహద్దు నుండి తమ సేనలను వెనుకకు తీసుకోవడానికి అంగీకరించింది. ఢిల్లీలో విడుదల చేసిన రెండు పత్రికా ప్రకటనలలో విభేదాలు ఉన్నప్పటికీ, చర్చలు, వ్యూహాత్మక స్థాయి సమాచార ప్రసారాన్ని కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

లడఖ్ నుండి వైదొలుగడంను ఇరుపక్షాలు వేగంగా పూర్తి చేయాలన్న ఒప్పందం తర్వాత ఎన్‌ఎస్‌ఏ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. జూన్ 6 నాటి ఏకాభిప్రాయం ఆధారంగా వెనుకడుగు వేసే ప్రక్రియ జరగాలని ఇరువర్గాలు తీవ్ర చర్చలు జరిపాయి.

ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా అభివృద్ధికి చెందడాని భారత-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి.  ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరమని, విభేదాలు వివాదాలుగా మారడానికి ఇరు పక్షాలు అనుమతించకూడదని ఇరు పక్షాలు నాయకుల ఏకాభిప్రాయం నుండి మార్గదర్శకత్వం తీసుకోవాలని అంగీకరించారు. అందువల్ల, సరిహద్దుల వద్ద శాంతి,  ప్రశాంతత యొక్క పూర్తి పునరుద్ధరణ కోసం దళాలను పూర్తిగా వెనుకకు తీసుకోవడం అవసరమని వారు అంగీకరించారు.

వాస్తవం ఏమిటంటే, భారత్ చైనాతో గట్టిగా నిలబడి చైనాతో ముందుకు సాగింది. తమ సేనలను వెనుకకు తిప్పి పంపాలనే భారతదేశం ధృడ సంకల్పం యొక్క ఉద్దేశ్యం. ఉద్దేశ్యం యొక్క తీవ్రత అన్ని సమయాలలో ఉన్నాయని చైనా గ్రహించింది.

గత నెలలో ఏమి జరుగిందో , చైనా దురాక్రమణ యొక్క ప్రతి కదలికను భారతదేశం ఎలా ఎదుర్కుంటుందో వారు గమనించారు. బీజింగ్‌తో దశాబ్దాల కాలం పాటు భారత్ ఆచి, చూసి వ్యవహరిస్తూ ఉండడంతో ఇప్పుడు కూడా  ‘మృదువుగా’ ఉంటుందని చైనా తప్పుగా అంచనా వేసింది. అందుకనే ప్రస్తుతానికి వారు మరింత దూకుడుకుగా ఉండే ప్రయత్నం చేయకుండా వెనుకకు అడుగులు వేయక తప్పలేదు.

ఎల్‌ఐసి వెంట చైనా ఒత్తిడిపై భారతదేశం తీవ్రంగా స్పందించడంతో ఎటువంటి పరిస్థితులకైనా సిద్దమనే సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. అది నెత్తుటి వాగ్వివాదం లేదా యుద్ధం అయినా సరే అన్నట్లు వ్యవహరించింది . చైనాతో షరతులపై చర్చలు జరపడానికి భారతదేశం ఒక్కసారి కూడా అంగీకరించలేదు. పైగా, దాని దౌత్య, ఆర్థిక, సైనిక శక్తిపై పోరాడటానికి సిద్దపడింది.

తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఐసి వెంట 30,000 మంది సైనికులు, భారీ ఆయుధాలను ప్రవేశపెట్టడం ద్వారా పిఎల్‌ఎ మోహరింపులను ‘ప్రతిబింబిస్తుంది’. అయితే  భారతదేశం వేగవంతంగా స్పందించే విధంగా  సైనిక నిర్మాణం కలిగి ఉండడం ఖచ్చితంగా చైనీయులను ఆశ్చర్య పరిచింది. అదేవిధంగా, సుఖోయ్ -30 ఎంకేఐ, మిగ్ -29 వంటి యుద్ధ విమానాలు, అపాచీ దాడి, చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్లు ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించి పహారా కావించడం చేశాయి. 

భారతదేశం యొక్క సైనిక ప్రతిస్పందన, తీవ్రమైన దౌత్య ప్రయత్నాలతో కలిపి గొప్ప ప్రభావాన్నే చూపాయి. ప్రపంచ నాయకులు చైనా యొక్క చేష్టలు, ఎత్తుగడలకు వ్యతిరేకంగా పిలిచారు. భారత్  దృక్పథాన్ని అంతర్జాతీయ సమాజం అర్ధం చేసుకొనేటట్లు చేయడంతో సానుభూతి, మద్దతు రెండూ లభించాయి.

అమెరికా, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కెనడా,  జపాన్ దేశాలతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. భారతదేశం-చైనా ఘర్షణ, కారణాలు;   భారత్ ఎలా వ్యవహరిస్తుంది అనే అంశాలపై వారిలో తీవ్రమైన ఉత్సుకత నెలకొంది. కోవిడ్ -19, ఆ తరువాత చైనా చర్యల దృష్ట్యా భారతదేశం చెప్పే విషయాలను అంతర్జాతీయ సమాజం బాగా గ్రహించింది.

చైనాను కట్టడి చేయడానికి భారతదేశం యొక్క వ్యూహం ప్రపంచ వ్యాప్తంగా పనిచేసింది. ఇది చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అంతర్జాతీయ ఒత్తిడికి గురిచేసింది. భారతదేశపు కఠినమైన వైఖరి చైనాకు ఆర్థికంగా ముప్పు కలిగించింది.

59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన తరువాత, చైనా కంపెనీలను జాతీయ రహదారుల ప్రాజెక్టులలో పాల్గొనడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ రైల్వే ఒక చైనా కంపెనీకి ఇచ్చిన ముఖ్యమైన టెండర్‌ను రద్దు చేసింది. చైనా పరికరాలను దిగుమతి చేసుకోవడం మానేయాలని బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను కూడా కోరారు.

‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రధాని పిలుపునిచ్చిన తరువాత, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వర్తకుల సంఘాలు పిలుపిచ్చాయి. భారతదేశం ఇప్పుడు అనేక రంగాలలో చైనాను లక్ష్యంగా చేసుకుని వాణిజ్యం, సేకరణ పరిమితులను పరిశీలిస్తోంది. హువావే వంటి చైనా కంపెనీలను 5 జి ట్రయల్ నుండి దూరంగా ఉంచే నిర్ణయం తీసుకుంటుంది.

ఈ చర్యలు చైనా కంపెనీలకు బిలియన్ డాలర్లు నష్టం కలిగిస్తున్నాయి.  ఈ చర్యల కారణంగా చైనీస్ కంపెనీలకు సుమారు  50 బిలియన్ల డాలర్ల నష్టం కలిగించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది.  భారతదేశం నుండి వచ్చిన సందేశం ఏమిటంటే, చైనా పశ్చాత్తాపం చెందకపోతే, వాస్తవాధీన రేఖ నుండి  తమ దళాలను వెనక్కి తీసుకోకపోతే, వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సాధారణ స్థాయిలో కొనసాగించలేమనే స్పష్టమైన సందేశాన్ని చైనాకు భారత్ అందించినట్లయింది. .