మోదీకి ట్విటర్లో 6 కోట్ల ఫాలోవర్లు!  

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌మీడియాలో చాలా క్రియాశీలకంగా ఉంటారు.  సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది.  తాజాగా మోదీ ట్విటర్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 6 కోట్లు దాటింది. భారత్‌లో ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్లు   మోదీకే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ ​మూడో స్థానంలో నిలిచారు.  120 మిలియన్‌ ఫాలోవర్స్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, 83 మిలియన్‌ ఫాలోవర్స్‌తో ప్రస్తుత యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో స్థానంలో ఉన్నారు.
2009లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. 2014లో ప్రధాని పదవి చేపట్టడంతో  ఆయనకు ఆదరణ బాగా పెరిగింది.  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా ట్వీట్లు చేస్తున్నారు.
ఇక భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయుకుడికి లేని ఫాలోవర్స్‌ను మోదీ దక్కించుకున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా 37 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  దేశ విదేశాల్లో ఆయన పర్యటనలు, తాను కలిసి ముఖ్యవ్యక్తుల వివరాలు, వివిధ వేదికల్లో ఆయన చేసిన ప్రసంగాలు తదితర అంశాలపై మోదీ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.