పెయిడ్ వార్తల కన్నా ఫేక్ న్యూస్ ప్రమాదం

పెయిడ్ (చెల్లింపు) వార్తలకన్నా ఫేక్ (నకిలీ) వార్తలు మన సామజిక జీవనంపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతాయి కాబట్టి చాలాప్రమాదకరమైనవని కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రి ప్రకాష్ జవదేకర్ హెచ్చరించారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు:

ప్ర: నేడు ప్రతి వారు ఫేక్ న్యూస్ గురించి చర్చిస్తున్నారు. వాస్తవం ఏమిటి?

జ: పెయిడ్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ చాలా ప్రమాదకరమైనదని నేను భావిస్తున్నాను. పెయిడ్ న్యూస్ కూడా ప్రమాదకరమైనది అయినప్పటికి దానికి ఒక ప్రయోజనం కోసం లేదా వ్యక్తి కోసం ప్రచారంపై మాత్రం పరిమితమై ఉంటుంది.

కానీ ఫేక్ న్యూస్ సమాజాన్ని కలుషితం చేస్తుంది. అది అబద్దాలను వ్యాప్తి చేస్తుంది. వాటికి సామాజిన జీవనానికి హానికలిగించే సామర్ధ్యం ఉంటుంది. భారత దేశం గురించి ప్రతికూల భావన కలిగించే ఏ వార్తకైనా అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రాధాన్యత ఇస్తాయి. 

ప్ర: మీ మద్దతుదారులు కూడా ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

జ: ఫేక్ వార్తలకు ముగింపు పలకాలి. వాటిని ఎవ్వరు సృష్టిస్తున్నారు అన్నది అసందర్భం. అవి సమాజానికి ప్రమాదకరం. 

ప్ర: వాటిని ఎవ్వరు సృష్టిస్తున్నారో కనుగోవడం ముఖ్యమా?

జ: సోషల్ మీడియాను ఐటి చట్టం నియంత్రిస్తుంది. కానీ ఐటి చట్టానికి పరిమితమైన నిబంధనలు ఉన్నాయి. ఈ రుగ్మతను అడ్డుకోవడం కోసం కొన్ని ముఖ్యమైన, ప్రభావం చూపగల చర్యలు తీసుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. 

ప్ర: ఆ చట్టాన్ని సవరిస్తారా?

: నేను ఆ చట్టాన్ని అధ్యయనం చేయలేదు. అందుకనే దానిని సవరించవలసిన అవసరం ఉన్నదని చెప్పలేను. కానీ ఈ అంశాన్ని తాజాగా చూడవలసిన అవసరం ఉన్నది. ఫేక్ వార్తలు అన్నవి వాటిల్లో ఉండే సమాచారాన్ని సంబంధించినవి. సమాచారంపై సంబంధించిన అంశాలను ఎవ్వరు చూడాలి అనే అంశంపై ఎటువంటి ఏర్పాటు లేదు. 

ప్ర: ఫేక్ వార్తలు అనేడివి ఒకరిని మరొకరు ధ్వసం చేసుకోవడానికి ప్రయోగించే రాజకీయ ఆయుధంగా మీరు చూస్తున్నారా?

స: ఎన్నికలలో ఓటమి చెందిన వారు తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేయడం కోసం ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. 

ప్ర: కానీ మీకు మీడియాపై నియంత్రణ ఉన్నదని కాంగ్రెస్ చెబుతున్నది. 

జ: అదేమీ లేదు. పత్రికా స్వాతంత్య్రం పూర్తిగా ఉన్నది. కేవలం ఎమర్జెన్సీ సమయంలోనే నియంత్రణ జరిగింది. 

ప్ర: తమను మాట్లాడకుండా చేయడం కోసం మీరు మీడియాను ఉపయోగిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. 

: అబద్దాలు చెప్పుకొంటూ పోతే ఒకరు గెలుపొందలేరు. ప్రజలు వాస్తవాలను చూస్తారు. తాను ఘనకార్యం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కానీ నేడు ఒక ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ తో కలసి లేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఏకాకిగా ఉంది. 

ప్ర: ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ లను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వారిపై ఎఫ్ ఐ ఆర్ లను నమోదు చేస్తున్నారు. 

జ: లేదు. న్యాయవ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది. ప్రభుత్వం ఎప్పుడు కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. మీరా కేసులను చూస్తే అవి భిన్నమైనవని తెలుస్తుంది. 

ప్ర: మిమ్ములను వ్యతిరేకించే జర్నలిస్ట్ లపై ఎఫ్ ఐ ఆర్ లను దాఖలు చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా?

జ: లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. వారిపై ఎటువంటి ఎఫ్ ఐ ఆర్ దాఖలు కాలేదు. చట్టప్రకారమే కొందరిపై దాఖలు చేశారు. 

ప్ర: ఎవరైనా మీ పార్టీ గురించి మాట్లాడితే వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. 2014 ముందు కూడా బిజెపి సభ్యులు ఇటువంటి పదాలను వాడేవారు. 

జ: అదేమీ లేదు. ఉద్దేశ్యం పూర్తిగా భిన్నం. వారి ఉద్దేశ్యాలు అబద్దాలను వ్యాప్తి చేయడమే. 

ప్ర: దూరదర్శన్ ను దుర్వినియోగం చేస్తున్నారని, మీడియాపై వత్తిడులు తెస్తున్నారని, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా ఉండేవారికి ప్రకటనలు నిలిపి వేస్తున్నారని, డిఎవిపి వద్ద బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. 

జ: నా హయాంలో అదెప్పుడు జరగానే లేదు. డిఎవిపి అంశం భిన్నమైనది. గత కొద్దీ నెలలుగా 80 శాతం బిల్లులను చెలించాము. 

ప్ర: సంఘ్ పరివార్ కు చెందిన వారిని వివిధ ప్రభుత్వ సంస్థలలో నియమిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

స: ఆ విధంగా జరగడం లేదు. ప్రతిభ ఆధారంగానే ఎవరినైనా నీయిస్తున్నాము. 

ప్ర: పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ముసాయిదాపై విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలకు అనుమతులు హడావుడిగా ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

జ: ముసాయిదాకు ప్రజలు తమ అభిప్రాయాలను, ఫిర్యాదులను ఆగష్టు 10 వరకు పంపుతూ ఉండవచ్చు. జారీ చేస్తున్న పర్యావరణ అనుమతులు ఒకే విధంగా ఉన్నట్లు 2009 నుండి గణాంకాలను చూస్తే వెల్లడి అవుతుంది. అయితే ప్రాజెక్ లకు వేగంగా అనుమతులు ఇస్తున్నాము. 

ప్ర: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా అవసరం ఉందా? పలు ఏజెన్సీలు ఒకే అంశాన్ని చూస్తున్నాయి. 

: ప్రభుత్వం తన పని తనకు చేయాలను నేను భావిస్తున్నాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో మేము పూర్తిగా సహకరిస్తున్నాము. ఏ ఒక్క ఏజెన్సీని తీసి వేసే అంశం కాదు. కానీ సుప్రీం కోర్ట్, హై కోర్ట్ లు ఉన్నప్పుడు బహుళ సంస్థల అంశం ప్రస్తావనకు వస్తుంది.