ఎపిలో ఒక్కరోజులో 37 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. కరోనా బారిన పడిన బాధితులు నిన్న ఒక్కరోజే 37 మంది మృతి చెందారు. కరోనా కేసులు కూడా అత్యధికంగా 1,935 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 365 మంది కరోనాతో చనిపోయారు.
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 13 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారికి ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 31,103కు చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఆరుగరు, కర్నూల్‌ జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. 
 
చికిత్స ద్వారా కోలుకున్నవారు 16,464 మంది ఉండగా ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 14,274 మంది ఉన్నారు.  రికవరీ రేటు తగ్గడం, మరణాల రేటు పెరగడం మాత్రం ఒకింత ఆందోళన కలిగించే పరిణామంగా కూడా భావిస్తున్నారు.