జన సమ్మర్ధం ఎక్కువగా ఉంటె గాలిలో వైరస్ 

The Union Minister for Health & Family Welfare, Science & Technology and Earth Sciences, Dr. Harsh Vardhan visiting the Lok Nayak Jaiprakash Narayan Hospital to take stock of preparedness to overcome COVID-19, in Delhi on April 04, 2020.

 
 కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణపై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందనడానికి కొన్ని ఆధారాలు ఉన్నట్టు పేర్కొన్నది. ఇరుకు గదుల్లో, జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట వైరస్‌ గాలి ద్వారా  వ్యాపించవచ్చని తెలిపింది. 
 
వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ గాలిలో కొద్ది సేపు ఉంటుందని, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట అది ఇతరులకు వ్యాపించవచ్చని తెలిపింది. ప్రజలు సాధ్యమైనంత ఎక్కువగా భౌతిక దూరం పాటించాలని సూచించింది. అయితే ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్నది.
 
32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తిపై ఇటీవల సంస్థకు లేఖ రాస్తూ మార్గదర్శకాలు సవరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఏమీ లేవని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ స్పష్టం చేశారు. 
 
కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు 5 మైక్రాన్ల కన్నా తక్కువ సైజులో తేలికగా ఉంటాయని తెలిపారు. అవి కొద్ది సేపు గాలిలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. వాటిని పీల్చుకోవడం వల్ల వైరస్‌ సోకే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.