కేరళ రాజకీయాల్లో బంగారం స్మగ్లింగ్ దుమారం 

బంగారం అక్రమ రవాణా కేసు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ప్రకంపనలు పుట్టిస్తున్నది. ఇందులో సిఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటి సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. 
 
ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. 
 
ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ 15 కోట్ల విలువైన గోల్ స్మగ్లింగ్స్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు ఉద్యోగిని ప్రశ్నిస్తున్నారు.
 
మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ యూఏఈ కాన్సులేట్ అధికారి, ప్రస్తుతం ఐటి ఉద్యోగి స్వప్న సురేష్ పాత్ర కీలక సూత్రధారిగా గుర్తించారు. ఆమెను రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు.  శివశంకర్ కు సన్నిహితురాలిగా భావిస్తున్న ఆమెను ఐటీ శాఖలో ఆరు నెలల ఒప్పందం ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నట్టు తేల్చారు.
 
ఐటి శాఖను ముఖ్యమంత్రి విజయం నిర్వహిస్తుండడంతో రాజకీయంగా ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధం దొరికింనట్లయింది. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్  చేయగా,నిందితులను విడిపించడంకోసం ముఖ్యమంతి  కార్యాలయం నుండి వెళ్లిన్నట్లు చెబుతున్న టెలిఫోన్ కాల్స్ పై దర్యాప్తు జరిపించాలని బిజెపి కోరుతున్నది. 
 
తిరువ‌నంత‌పురంలో ఉన్న యూఏఈ కాన్సులేట్‌కు ఆ బంగారం స్మిగ్లింగ్ జ‌రిగిన‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు.
విమానాశ్రయంలో పట్టుబడిన బ్యాగ్ అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు విదేశాంగ శాఖ అధికారులకు తెలిపారు. అందులో ఏమున్నాయో చెప్పాలని ఢిల్లీలోని యుఎఇ రాయబార కార్యాలయం వారిని వారు కోరగా వారు అందులో న్యూడిల్స్, ఖర్జురామ్, బిస్కట్లు వంటివి ఉన్నాయని చెప్పారు.  
అయితే ఎక్సరే లో చూడగా అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు కస్టమ్స్ వారు తెలపడంతో, దానిని తెరిచి చూడడానికి విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చింది. అప్పుడు బంగారం ఉన్నట్లు వెల్లడైనది. ఈ కేసులో సీఎం కార్యాల‌యం పాత్ర ఉన్న‌ట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.
ఈ కేసులో నిందితులైన స‌రిత్ , స్వ‌ప్నా సురేశ్‌లకు ఐటీ శాఖ కార్య‌ద‌ర్శితో ఈ ఇద్ద‌రికీ అనుబంధం ఉన్న‌ట్లు కూడా ప‌సిక‌ట్టారు.  సీఎంవో నుంచి ఫోన్లు వెళ్ల‌డం వ‌ల్లే  బంగారం స్మ‌గ్లింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.
 
బంగారం స్మ‌గ్లింగ్‌లో సీఎం కార్యాల‌య ప్ర‌మేయం ఉన్న‌ట్లు కేరళ ప్రతిపక్ష నేత ర‌మేశ్ చెన్నితాల ఆరోపించారు.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌దాని మోదీకి కూడా లేఖ రాశారు. యూఏఈ కాన్సులేట్ అధికారాల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. కేర‌ళ ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తున్న వారు అంత‌ర్జాతీయ బంగారం  స్మ‌గ్ల‌ర్ల‌తో క‌లిసి దందా సాగిస్తున్న‌ట్లు  ర‌మేశ్  ఆరోపించారు