కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలను కనిష్ట స్థాయికి అనగా ఒక శాతానికి కంటే మించకుండా అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కరోనా లక్షణాలు గల వారికి వీలైనంత అధిక సంఖ్యలో టెస్టులకు నిర్వహించాలని చెప్పారు.
అలాగే రెడ్ స్పాట్ లుగా మారేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన మార్గదర్శకాలను తుఛ: తప్పక పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.
ఇంటినుండి బయిటకు వచ్చినపుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ఖచ్చితంగా పాటించాలని చెబుతూ ఒకవేళ ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణకు ఆరోగ్య సేతు యాప్ వినియోగం వంటి ఇతర సాంకేతిక విధానాలను పూర్తిగా వినియోగించుకోవాలని రాజీవ్ గౌబ సూచించారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో 60శాతం పైగా కోలుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతూ దీనిని మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500