టీవీ-9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. గతంలో బంజారాహిల్స్ పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు తాజా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులో రవిప్రకాశ్‌ను విచారించేందుకు త్వరలోనే సమన్లు జారీ చేసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్‌డ్రా చేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్‌పై నిరుడు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం గత అక్టోబరులో ఆయన్ని అరెస్ట్ చేశారు.
రవిప్రకాశ్‌పై మోపిన అభియోగాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు.

More Stories
‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ పోస్టర్ ఆవిష్కరణ
కేశవ నిలయంలో “పంచ పరివర్తన్”పై ఏఐలో కార్యశాల
తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్