తెలంగాణ హోంమంత్రికి కరోనా

హోమ్ శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కి పైనుండి.  ఆయన కొన్ని రోజులుగా హోంక్వారంటైన్ లో ఉన్నారు. 

ఆయన సిబ్బందిలో కొంతమందికి ఇటీవలే కరోనా నిర్దారణ అయింది. దాంతో ఆయన కూడా మూడు రోజుల కింద కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో మహమూద్ అలీకి కరోనా సోకినట్లు గత రాత్రి వైద్యులు తేల్చారు. 

దాంతో ఆయన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స చేరి పొందుతున్నారు. మహమూద్ అలీతో పాటు ఆయన మనవడికి కూడా కరోనా సోకినట్లు తేలింది. మహమూద్ అలీ ఈ నెల 25న గోషా మహల్ స్టేడియంలో హరితహారం కార్యక్రమంలో పాల్గాన్నారు. 

ఇదే కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ లు కూడా పాల్గొన్నారు. దాంతో వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్యెల్యేలకు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.  తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. దానితో కరోనా బారిన పడిన ఎమ్యెల్యేల సంఖ్య నాలుగుకు పెరిగింది. 

మరోవైపు హైదరాబాద్ కేంద్ర సమాచార శాఖలో  కరోనా కలకలం రేపుతోంది. కవాడిగూడ సీజిెస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, కొందరు ఉద్యోగులకు సహా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో కార్యలయంలోని మిగతా ఉద్యోగలకు అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ లో సుమారు 170 మందికి కరోనా సోకిన్నట్లు చెబుతున్నారు.