జామియా నిరసనలను తప్పుబట్టిన   ఎన్‌హెచ్ఆర్‌సీ 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల నిర్వహణకు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు అధికారులు, పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారని అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) తప్పుబట్టింది. 2019 డిసెంబరు 15న జరిగిన సంఘటనలపై నివేదికను విడుదల చేసింది. 

విద్యార్థుల నిరసన కార్యక్రమాలు అధికారుల అనుమతి లేకుండా జరిగాయని, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థులు చెప్పినప్పటికీ, శాంతియుతంగా జరగలేదని పేర్కొంది. ఎస్ ఎస్ పి మంజిల్ సైనీ నేతృత్వంలోని  ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం ఆ రోజున జరిగిన ప్రదర్శన `చట్ట వ్యతిరేకమైనది’ అని, పోలీసులు జోక్యం చేసుకొనేటట్లు చేశారని అంటూ ఆరోపించింది.

జామియా మిల్లియా ఇస్లామీయ వద్ద జరిగిన నిరసనలు విద్యార్థుల ముసుగులో జరిగిన్నట్లు పేర్కొంటూ ఈ నిరసనల వెనుక అసలు ఎవరు ఉన్నారో, వారి ఉద్దేశాలు ఏమిటో దర్యాప్తు చేయవలసి ఉన్నదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ నిరసనలను స్థానిక రాజకీయ నాయకులు సమానవ్యయ పరుస్తూ, నేతృత్వం కూడా వహిస్తూ, అప్పుడప్పుడు ప్రసంగించేవారని పేర్కొన్నది. 

అక్కడ గౌమికూడదన్ని `చట్ట వ్యతిరేకం’ అని ప్రకటించిన పోలీసులకు అటువంటి సమూహాలను కట్టడి చేసి, శాంతిభధ్రతలు చేయవలసిన బాధ్యత ఉన్నట్లు గుర్తు చేసింది. పోలీసులు వారిని చెల్లాచెదురు చేయడం కోసం టియర్ గ్యాస్ షెల్స్, లాఠి ఛార్జి ఉపయోగించగా, వారిని నెట్టివేస్తూ, ప్రదర్శకులు రోడ్ పక్కన ఉన్న ఆస్తులకు కూడా నష్టం కలిగించారని నివేదిక తెలిపింది. 

అటువంటి పరిస్థితులలో, వ్లద్యార్థులు రాళ్లతో దాడి చేస్తుండడంతో  యూనివర్సిటీ ఆవరణలోకి ప్రవేశించడం తప్ప ఢిల్లీ పోలీసులకు మరో మార్గం లేకపోయినదని ఎన్‌హెచ్ఆర్‌సీ స్పష్టం చేసింది. 

“చట్ట వ్యతిరేకంగా గుమికూడిన వారు జామియా యూనివర్సిటీ దగ్గరలో ట్రాఫిక్ ను నిలిపి వేశారు. అక్కడి నుండి పోలీసులపై రాళ్లు వేస్తూ యూనివర్సిటీ ఆవరణలోకి ప్రవేశించారు. దానితో మరో మార్గం లేక పోలీసులు కూడా లోపాలకు వెళ్లి హింసను, అల్లరి మూకలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు లైబ్రరీ లోపలకు వెళ్లి, పోలీసులను అడ్డుకోవడం కోసం దారిని బ్లాక్ చేశారు. దానితో వారిని తొలగించడం కోసం లైబ్రరీ తలుపులు తెరవలసి వచ్చింది” అంటూ నివేదిక వివరించింది. 

నిరసనలు శాంతియుతంగా కొనసాగి ఉంటె, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందో, అనేక వాహనాలను దగ్ధం చేశారో అన్నదానికి జవాబు లేదని నివేదిక స్పష్టం చేసింది. గేట్ల వద్ద ఐడి కార్డు లను సరిగ్గా తనిఖీ చేయక పోవడంతో బయటివారు లోపలకు ప్రవేశించారని అనుమానాలు కలుగుతున్నదని పేర్కొన్నది. 

పైగా, విద్యార్థులలో నెలకొన్న అశాంతిని పోలీసులకు తెలపడంతో యూనివర్సిటీ యాజమాన్యం విఫలమైన్నట్లు విమర్శించింది. పైగా, విద్యార్థులను శాంతిపరచే ప్రయత్నం చేయలేదని నిందించింది. 

ఎన్‌హెచ్ఆర్‌సీ విడుదల చేసిన నివేదికలో ఈ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలోకి ప్రవేశించి బాష్పవాయు గోళాలను ప్రయోగించి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన యూనిఫాం ధరించని సిబ్బందిని గుర్తించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌లను ఆదేశించింది. ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు ఎదురైనపుడు ఏ విధంగా వ్యవహరించాలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.