ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ స్వేఛ్చ గురించి మాట్లాడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఎద్దేశా చేశారు. జూమ్ యాప్ ద్వారా తెలంగాణలోని బీజేపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎమర్జెన్సీ  డే సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. 
 
ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతలా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాలరాసింది అందరూ మర్చిపోయారనుకుంటోందని తెలిపారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాసిన కాంగ్రెస్ ఈ రోజు స్వేచ్ఛ గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని దయ్యబట్టారు.
 
 ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కొన్ని పార్టీ ల నాయకులు తమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ తో సహా ఎక్కువగా కుటుంబ పార్టీలు ఉన్నాయని.. ఒక్క బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ కుల, కుటుంబ పార్టీలే ఉన్నాయని స్పష్టం చేశారు. 
 
దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యానికి ఢోకా ఉండదని భరోసా ఇచచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేకతను, అవినీతిని, కుటుంబ రాజకీయాలను.. దేశ వ్యతిరేక కార్యకలాపాలను పెంచిపోషిస్తోందనిమురళీధర్ రావు దుయ్యబట్టారు.