జమ్మూకశ్మీర్ లోని జాదిబాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో పోలీసులు, బలగాలు కలిసి సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
దీంతో ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా ముగ్గురు పట్టుబడ్డారు. మొత్తానికి ఈ ముగ్గురిని మట్టుబెట్టారు పోలీసులు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో శ్రీనగర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఈ ముగ్గురిలో ఇద్దరు 2019 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మరో ఉగ్రవాది గత నెలలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. శ్రీనగర్ లో ఒక నెలలోనే రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి.
మే నెలలో శ్రీనగర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకరు కశ్మీరీ వేర్పాటువాది నాయకుడి కుమారుడు ఉన్నాడు.
More Stories
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం
గగన్యాన్, శుక్రయాన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం