
ఉత్తర ప్రదేశ్ చెరకు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాము అధికారంలోకి వచ్చాక వారికి రూ 1 లక్ష కోట్ల మేరకు చెల్లించామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని చెరకు రైతులకు రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో 47.20 లక్షల మంది చెరకు రైతులకు రూ.1,00,000 కోట్లకు పైగా చెల్లించినట్లు చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ చెరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన చెరకుకు 2014-17 మధ్య మూడేళ్ళలో రూ.53,367 చెల్లించినట్లు తెలిపారు. 2017-2020 మధ్య మూడేళ్ళ కాలంలో ఈ చెల్లింపులు రూ.1,00,000 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. అంటే 2017-2020 మధ్య కాలంలో రూ.46,633 కోట్లు అధికంగా చెల్లించినట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం చెరకు రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి యోగి భరోసా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో మిగిలిన పరిశ్రమలు మూతబడినప్పటికీ, ఉత్తర ప్రదేశ్‌లోని పంచదార మిల్లులు యథావిథిగా క్రషింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
More Stories
యాసిన్ మాలిక్కు మరణ శిక్ష విధించాలన్న ఎన్ఐఏ
జులైలో చంద్రయాన్ – 3 ప్రయోగం
అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని