నవంబర్‌ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

నవంబర్‌ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు
నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ ఒకటి వరకు తుంగభద్ర పుష్కరాలు నిర్వహించనున్నట్లు కర్నూలు కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి మూడు రకాల ప్రణాళికలను సిద్ధం చేసి వారం రోజుల్లో నివేదికలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 
పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో  కలెక్టర్‌ సమావేశం నిర్వహిస్తూ తుంగభద్ర పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సాధారణ పరిస్థితుల తరహాలో అధిక సంఖ్యలో యాత్రికులు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 
 
మొదటి ప్రణాళిక ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రెండోది ప్రొటోకాల్‌ ప్రకారం నిబంధనలు రూపొందించాలని చెప్పారు. 
 
మూడో ప్రణాళిక ప్రకారం యాత్రికుల ఆచార సంప్రదాయాలకు తగిన విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి వారం రోజుల్లో నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. 14 రకాల కమిటీలు ఏర్పాటు చేశారు.