కాంగ్రెస్ యంపీ రాహుల్ గాంధీకి చైనాతో అదృశ్య సంబంధం ఉందా? అందుకేనా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో దురాక్రమణకు ప్రయత్నం చేస్తూ, 20 మంది మన సైనికులను బలి తీసుకున్న ఆ దేశంపై కఠినంగా ఒక మాటకూడా మాట్లాడలేక పోగా, ప్రధాని నరేంద్ర మోదీలో పొరపాట్లను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారా?
మొత్తం దేశ ప్రజల చైనా దురాక్రమణ పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూ, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఘాండ్రిస్తుంటే రాహుల్ మాత్రం మౌనం వహించడం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తున్నది.
ఈ సందర్భంగా 2008లో రాహుల్ పరివారం అంతా చైనాలో ఒలింపిక్ క్రీడలను చూడడంకోసం అంటూ వెళ్లి చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకొని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆ ఒప్పందంపై రాహుల్ సంతకం చేయడం గమనార్హం.
2008 ఆగష్టు 7న సోనియా గాంధీ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ తరపున ప్రస్తుత చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ నాటి దేశ ఉపాధ్యక్షుడిగా ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో స్థాయిసంఘం సభ్యుడిగా చేశారు.
ఈ ఒప్పందంపై సంతకం చేసే ముందు జింగ్ పింగ్, ఇతర కమ్యూనిస్ట్ అగ్రనాయకులతో సోనియా, రాహుల్ సుదీర్ఘ సమావేశం జరిపారు. భారత దేశంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్ష పార్టీలు ఆ ప్రభుత్వం నుండి బైటకు రావాలని చూస్తున్న సమయంలో జింగ్ పింగ్ కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాల కోసం ఈ ఒప్పందం చేసుకున్నట్లు కధనాలు వచ్చాయి.
ఈ ఒప్పందం ప్రకారం ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు పార్టీలు పరస్పరం సంపాదించుకొనే అవకాశం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ లతో పాటు ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారిద్దరి పిల్లలు ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అంతకు ముందు సంవత్సరం కూడా సోనియా, రాహుల్ కలసి కాంగ్రెస్ అధికార ప్రతినిధివర్గంగా చైనాలో పర్యటించారు. అంతేకాదు, గత కొద్దీ సంవత్సరాలుగా చైనా పట్ల రాహుల్ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
భారత్ – చైనా డొక్కలం వ్యవహారంలో ఘర్షణపూరిత వాతావరణంలో ఉన్న తరుణంలో 2017లో రాహుల్ ఢిల్లీలో చైనా రాయబారిని రహస్యంగా కలవడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ సమావేశం జరిగిన్నట్లు చైనా రాయబారి వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది.
కనీసం రెండు సార్లు కీలకమైన చైనా వ్యక్తులను రాహుల్ రహస్యంగా కలసిన్నట్లు వెల్లడైనది. కాంగ్రెస్ విధానాలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం చూపుతున్నదా అనే అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.
సెప్టెంబర్, 2018లో మానసరోవర్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కొందరు చైనా మంత్రులతో రహస్య సమావేశం జరిపినట్లు రాహుల్ స్వయంగా వెల్లడించారు. మొదట ఈ సమావేశాల గురించి రహస్యంగా ఉంచినప్పటికీ ఆ తర్వాత అనుకోకుండా బైటపడ్డారు.
ఇలా ఉండగా, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి గత నెలలో లడఖ్ ప్రాంతంలో చైనా దురాక్రమణ ధోరణులను ఖండిస్తూ, భారత సేనలను ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. చైనాను విస్తరణవాదిగా అభివర్ణిస్తూ అటువంటి విషపు పాములను భారత సేనలు మట్టుబెడతాయని హెచ్చరించారు.
పైగా, వెంటనే తైవాన్ ప్రభుత్వంతో దౌత్యపర సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అయితే పార్టీ నాయకత్వం ఆయనపై వత్తిడి తెచ్చి ఆ ట్వీట్ ను ఉపసంహరింప చేసింది. ఆ ట్వీట్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని, పార్టీకి సంబంధం లేదని అంటూ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ వివరణ ఇచ్చారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!