కాశి, మధురల కోసం సుప్రీం లో తాజా కేసు!

అయోధ్యకు సంబంధించిన వివాదం పరిష్కరించి, హిందువులకు అప్పగించిన సుప్రీం కోర్ట్ ద్వారా ఇప్పుడు కాశి, మధుర వంటి క్షేత్రాలను కూడా పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రార్ధన స్థలాల చట్టం, 1991ను సవాల్ చేస్తూ విశ్వా భద్ర పూజారి పురోహిత్ మహాసంఘ్ సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ అందుకు సానుకూల పరిస్థితి కలిగించే అవకాశం ఉంది. 

1991లో పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టం 1447 ఆగష్టు 15 నాటు నెలకొన్న ప్రార్ధన స్థలాల స్వభావాన్ని కొనసాగించాలని నిర్ధేశిస్తుంది. ప్రార్ధన స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991లోని సెక్షన్ 4న సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిబంధన ఏ దేవాలయాన్ని మసీదుగా, మసీదును దేవాలయంగా మార్చడాన్ని ఒప్పుకోదు. అయితే కాశీ, మధురలలో దేవాలయాల స్థానంలో మసీదులు నెలకొనడంతో ఈ పిటిషన్ ప్రాధాన్యత నెలకొంది. 

గత ఏడాది నవంబర్ 9న సుప్రీం కోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు అయోధ్యలో ఒకప్పుడు నెలకొన్న బాబ్రీ మసీద్ ను కూల్చివేసిన వివాదాస్పద స్థలంలో  రామాలయం నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. హిందువుల ఆ పవిత్ర నగరంలో మసీద్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఇవ్వాలని చెప్పింది. 

పైగా, అయోధ్య తీర్పులో ప్రార్ధన స్థలాల చట్టం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగోయ్ నేతృత్వంలో గల ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ చట్టాన్ని భారత లౌకిక తత్వం కాపాడడానికి రూపొందించారని, అది మన రాజ్యాంగం మౌలిక స్వభావంలో ఒకటని స్పష్టం చేసింది. పూర్వస్థితి పునరుద్ధరించాలి అంటే అనేక వివాదాలు పుట్టుకు వస్తాయని కూడా వ్యాఖ్యానించింది. 

అయితే పురోహితులు అయోధ్య బెంచ్ వాఖ్యలకు ఎటువంటి న్యాయపర ఆధారం లేదని తమ పిటిషన్ లో పేర్కొన్నారు.