మహారాష్ట్రలో చైనా కార్ల కంపెనీ గ్రేట్ వాల్ 

భారత – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలు నెలకొన్న ప్రస్తుత సమయంలో చైనాకి చెందిన కార్ల తయారీ కంపెనీ గ్రేట్‌ వాల్‌ ‌మోటార్స్‌ మనదేశంలోకి ఎంటరవుతోంది. చైనాకు చెందిన ఈ ఎస్‌యూవీ మేకర్ గ్రేట్‌వాల్ మోటార్స్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. 

మహారాష్ట్రలోని తలే గావ్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,612 కోట్లు)పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల మూడు వేల మందికి ఉపాధి లభిస్తుంది.  

తలేగావ్‌ లోని జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీని కొన్ని నెలల క్రితమే గ్రేట్వాల్ మోటార్స్ కొనుగోలు చేసింది. తాజాగా ప్లాంటు నిర్మాణం కోసం ఉద్దేశించి న ఎంఓయూపై కంపెనీ ప్రెసిడెంట్ జేమ్స్ యాంగ్, గ్రే ట్‌వాల్ మోటార్స్ ఇండియన్ సబ్సిడరీ ఎండీ పార్కర్ షీ, ఇండియాలో చైనా రాయబారి సన్ వీడాంగ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఈ రాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ సంతకాలు పెట్టారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత్ లో గ్రేట్‌వాల్ మోటార్స్ ఆపరేషన్స్ కోసం షి,యాంగ్‌లను కంపెనీ గత నెల 28న నియమించింది. ప్లాంటు ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఈ సందర్భంగా పార్కర్ షీ ప్రశంసించారు.

‘‘తలేగావ్‌లో నిర్మించే ప్లాంటులో రోబోటిక్ టెక్నాలజీని వాడుతాం. ఇందుకోసం ప్రొడక్షన్ ప్రాసెస్ లను ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ ప్రపంచస్థాయి ప్రీమియం వెహికల్స్ ‌ను తయారు చేస్తాం. ఆర్ అండ్ డీ సెంటర్‌‌ను సైతం నిర్మిస్తాం. క్రమంగా పెట్టుబడుల  విలువను బిలియన్ డాలర్లకు చేర్చు తాం”అని పార్కర్ వెల్లడించారు.

తలేగావ్ ఇండస్ట్రియ ల్ పార్కును 300 ఎకరాల్లోనిర్మించారు. ఇది ముంబై పోర్టుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చైనా ప్రభుత్వ కంపెనీ ఎస్ఏఐసీకి చెందిన ఎంజీ మోటార్స్ ఇది వరకే భారత్ మార్కెట్లో అడుగు పెట్టింది.  ఇది గత ఏడాది హెక్టర్ ఎస్ యూవీ లాంచ్ చేసింది. గ్రేట్‌వాల్ మోటార్స్ ‌ను హెబే ప్రావిన్సులో 1984లో స్టార్ చేశారు.