తిరుమలను ఎపి నియంత్రణ నుంచి తప్పించాలి

తిరుమల పవిత్రత కాపాడటం కోసం, అక్కడ రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ చాలాకాలంగా ఉద్యమిస్తున్న బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ విషయమై గతంలో హైకోర్ట్ నుసుప్రీం కోర్ట్ ను కూడా ఆశ్రయించారు. 
 
తాహాగా  టిటిడిని టార్గెట్‌ చేస్తూ ట్విట్టర్‌లో తన దైన శైలిలో ట్వీట్‌ చేశారు. తిరుమల ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలంటూ గతంలో తాను 2018లో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ అంశాన్ని మళ్లీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 
 
ఈ వ్యవహారం ఎపి హైకోర్టులో తేల్చుకోవాల్సిందిగా అప్పట్లో సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఎపి హైకోర్టులో చివరి దశలో ఉందంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేసారు. 
 
 మొత్తం పదకొండు ఆలయాల్లో దేశంలోనే అత్యంత ధనిక ఆలయమైన తిరుమల గత రెండు తరాలుగా ఎపి ప్రభుత్వ నియంత్రణలో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను సమర్ధిస్తూ తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరో ట్వీట్‌ చేశారు.