ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినప్పటి నుండి విశాఖపట్నంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయి. తాజాగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది.
టిడిపి, వైసిపి నాయకుల మధ్య వాగ్వివాదం చివరకు రాళ్ల దాడి వరకూ వెళ్లింది. దీంతో, టిడిపి కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే వెలగపూడి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర కారాగారం ఎదురుగాగల రామకఅష్ణాపురంలో సోమవారం పలు అభివఅద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే వెలగపూడి రావడంతో వివాదం చెలరేగింది.
గతంలో వీటికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారని, మళ్లీ ఎందుకు చేస్తున్నారని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో, టిడిపి, వైసిపి నేతల మధ్య వాగ్వివాదం చేటుచేసుకుంది. మాటమాట పెరగడంతో రాళ్లు, కొబ్బరికాయలతో టిడిపి కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు దాడికి దిగారు.
టిడిపి వార్డు కార్యదర్శి ఎల్లమెల్లి సురేష్, స్థానిక కాలనీ అధ్యక్షుడు భవిరీడుకు గాయపడ్డారు. దీంతో, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ఎమ్మెల్యే వెలగపూడి బైఠాయించారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ ఇమాన్యుల్‌రాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు