జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపొర ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కశ్మీర్ జోన్ పోలీసులు భద్రతా బలగాలతో కలిసి శుక్రవారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు.
ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. అనంత్ నాగ్ జిల్లాలోని లల్లన్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం శనివారం ఉదయం కూడా జవాన్లు గాలింపు కొనసాగిస్తున్నారు.
ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండగా మరో వైపు ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో భద్రతా బలగాలు వారి కోసం వేటాడుతున్నాయి. గత 15 రోజులుగా ఒకదాని వెంబటి మరొకటిగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్