పాకిస్థాన్‌లో మరో పరువు హత్య

పాకిస్తాన్‌లో ఈ మద్య కాలంలోనే జరిగిన పరువు హత్యను మరిచిపోకముందే అంతకు మంచిన మరో ఘటన చోటు చేసుకుంది. ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఈ రోజు జరిగిన పరువు హత్య సంఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ ను కాల్చి చెప్పారు. 

అతనితో పాటు 16 ఏళ్ల ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. అమ్మాయి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నౌషెరా జిల్లాలోని చెరత్‌ పలోసాయ్‌ పయాన్‌లోని షఫీ ముహమ్మద్‌ తన ఇంటి సమీపంలో ఉండే ఓ కానిస్టేబుల్‌ను కాల్చి చంపాడు. తన సోదరిని ఆ పోలీస్‌ ప్రేమించడంతో వారిద్దరిని పరువు కోసం చంపాలకున్నాడు ఆ దుర్మార్గుడు. 

ఈ క్రమంలో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడు ముహమ్మద్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాల్పుల సమయంలో ఎనిమిది బుల్లెట్‌ గాయాలు కావడంతో అతని 16 ఏళ్ల సోదరి ఆసుపత్రిలో పరిస్థితి విషమంగా ఉంది. బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు