
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తెన్‌తిరుప్పోరూరు సమీపంలోని కోట్టూరులో నివసిస్తున్న బీజేపీ స్థానిక శాఖ నాయకుడు రామయ్యదాస్ (50) దారుణహత్యకు గురయ్యారు.
కోట్టూరుకు చెందిన ఇసక్కి (22) అనే యువకుడికి చెందిన మేకలు సోమవారం సాయంత్రం రామయ్యదాస్‌కు చెందిన పొలంలో చొరబడి పంటను మేశాయి. ఈ సంఘటనపై ఆగ్రహం చెందిన రామయ్యదాస్ ఇసక్కితో గొడవపడ్డారు.
మంగళవారం ఉదయం రామయ్యదాస్ ఆ రులు మళ్ళీ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన ఇసక్కి వేటకొడవలితో రామయ్యదాస్‌పై దాడి జరిపాడు. ఈ ప్రాంతంలోని టీకొట్టు వద్ద నిలిచి వుండగా ఇసక్కి అతడి అనుచదాడిలో దాడి చేసాడు.
ఈ దాడిలో రామయ్యదాస్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఇసక్కి అతడి అనుచరులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం