
సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది.
సిచువాన్–టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ నుంచి టిబెన్‌లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది.
ఈ రైల్వే లైన్లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు చైనా రైల్వే వర్గాలు తెలిపాయి.
నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్–టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్‌తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన