“మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్ల జమ్మూకశ్మీర్‌ను మరింత అభివృద్ధి చేసుకుంటున్నాం. దాదాపు రూ.40వేల కోట్లతో జమ్మూలో అభివృద్ధికి బాటలు వేశాం. బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక నేటికి కార్యరూపం దాల్చింది. అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జ్, అంజిర్ వంతెనలు జాతికి అంకితం చేశాం. మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపించాం. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింతగా కొంత పుంతలు తొక్కుతుంది” అంటూ ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్ సహా దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు పేదలను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. “జమ్మూకశ్మీర్‌లో గత ఐదేళ్లలో 5 కొత్త వైద్య కళాశాలు ప్రారంభించాం. దీనితో మెడికల్ సీట్లు 500 నుంచి 1300కు పెరిగాయి. మా హయాంలో 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. ఎన్డీఏ హయంలో 50 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరవబడ్డాయి” అని ప్రధాని తెలిపారు.
“స్వచ్ఛభారత్ కింద 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. జల్‌జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇళ్లకు వాటర్ కనెక్షన్ ఇచ్చాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏకంగా 10 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం” అని వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ నిప్పులు చెరుగుతూ ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్థాన్‌కు ఓటమి గుర్తుకువస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. అయితే ఈ పోరాటంలో జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.
అలాగే భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి అదనంగా రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కోసం రూ.1 లక్ష ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

More Stories
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!