అధిక ఆదాయం గల దేశాలు చేసే వ్యయాలకు దగ్గరగా భారత్ కూడా ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుందని వివరించింది. విద్యా రంగంలో ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం జీడీపీలో 4.6 శాతం ఉందని, 2047-48 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 6.5 శాతానికి పెంచాలని సూచించింది. దేశ జనాభాలో యువత సంఖ్య, పని చేసే సామర్థ్యం గలవారి అవసరం పెరుగుతుండటాన్ని బట్టి ఈ పెరుగుదల అవసరమని తెలిపింది.
2020-21లో ఆరోగ్య రంగంపై జీడీపీలో 1.1 శాతం ఖర్చు చేశారని, 2047-48 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 3.8 శాతానికి పెంచాలని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ సేవల మెరుగుదల, సత్ఫలితాల కోసం ఈ ఖర్చు అవసరమని వివరించింది. ఎక్కువ మంది యువత, తక్కువ ఆదాయం గల రాష్ర్టాలకు విద్య, ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగినట్లుగా అదనపు నిధులను అందజేయాలని తెలిపింది. దశలవారీగా ఆర్థిక పునర్నిర్మాణం చేయడం వల్ల ఈ లక్ష్యాలను సాధించవచ్చునని, వృద్ధితో రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పింది.

More Stories
కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఆర్బీఐ నిర్ణయం
భారత్ ట్యాక్సీ యాప్ ప్రారంభించిన అమిత్ షా
మూడో త్రైమాసికంలో ఎల్ఐసి రూ.12,930 కోట్ల లాభాలు