
కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన మరోవైపు భారతీయ సంతతికి చెందిన మహిళల కోసం ‘బిఓబి గ్లోబల్ ఉమెన్ ఎన్ ఆర్ ఇ, ఎన్ ఆర్ ఓ సేవింగ్స్ అకౌంట్’ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లకు లాకర్ రెంట్ పై డిస్కౌంట్’తో పాటు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ, హోమ్ లోన్ ఇంకా తక్కువ ప్రాసెసింగ్ ఛార్జ్’తో ఆటో లోన్ వంటి సౌకర్యాలు అందిస్తుంది.
“ఈ సేవింగ్స్ అకౌంట్ నేటి ప్రపంచ భారతీయ మహిళల మారుతున్న డైనమిక్స్ గుర్తిస్తుంది. దీని ద్వారా మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ అధికారాలు, ఆలోచనాత్మకంగా రూపొందించిన ఫీచర్స్ అందించడం ద్వారా వారిని శక్తివంతం చేయడానికి రూపొందించబడింది” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బినా వహీద్ పేర్కొన్నారు.
కొత్తగా రూపొందించిన ఈ సేవింగ్స్ అకౌంట్ చాలా ఫీచర్లతో వస్తుంది. వీటిలో మంచి ట్రాన్సక్షన్స్ లిమిట్’తో కస్టమైజ్ డెబిట్ కార్డ్, ఉచిత దేశీయ ఇంకా అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్, ఉచిత సేఫ్ డిపాజిట్ లాకర్లు, ఉచిత వ్యక్తిగత ఇంకా విమాన ప్రమాద బీమా కవరేజ్ ఉన్నాయని బ్యాంక్ తెలిపింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం