మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్

మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్

డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి, మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ముందస్తు అనుమతులు లేకుండా పలు సార్లు విదేశీ యాత్రలు చేసినట్టు అభియోగం ఎదుర్కొంటున్నారు.  సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లిన సమయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, మరికొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లాన్‌కు విరుద్ధంగా సునీల్ విదేశాల్లో ప్రయాణించడం జరిగిందనే ఆరోపనలు వచ్చిప నేపథ్యంలో ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది.

విచారణ జరిపిన ఆ అధికారి ఇచ్చిన నివేధిక ఆధారంగా ప్రభుత్వం సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు సునీల్ పై ఛార్జ్ కూడా నమోదు అయింది. ఈ తరుణంలోనే డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఊహించని షాక్‌ ఇస్తూ సస్పెన్షన్ వేసింది ప్రభుత్వం.

2024 ఫిబ్రవరి లో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన వివరాలను డివియేట్ చేసి దుబాయ్ లో  సునీల్ కుమార్ పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున  ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ తిరిగి వచ్చారు.

2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి విమానంలో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న విమానంలో అమెరికా నుండి హైదరాబాద్ కు దుబాయ్ మీదగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. డిసెంబర్ 14 2022 నుంచి డిసెంబర్ 19 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్ లో పర్యటించారు.

2021 అక్టోబర్ 2న హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి, అక్టోబర్ 10నహైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకు కూడా ప్రభుత్వ అనుమతి లేదు . 21 డిసెంబర్ 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించారు.

ఇది ఇలాఉంటే, సునీల్ కుమార్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రసుత్త ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కూడా ధృవీకరించింది. ఈ విషయమై ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

అలాగే పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను బదిలీ చేసి ఇప్పటివరకు ఎటువంటి పోస్ట్ ఇవ్వలేదు.