బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబయి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముంబయిలో గతంలో అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుడు ఉపయోగించిన సిమ్ సదరు మహిళ పేరుపై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో బెంగాల్‌లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత సదరు మహిళను అరెస్టు చేశారు. ఆదివారం బెంగాల్‌కు చేరుకున్న పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఖుఖుమోని జహంగీర్ షేక్‌గా మహిళను గుర్తించగా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుడు షరీఫుల్ ఫకీర్‌తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
సైఫ్ అలీఖాన్‌పై ఈ నెల 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయనను కుటుంబీకులు లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. సైఫ్ దాడి కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
“సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ నివాసి అని, హిందూ గుర్తింపు పొందాడని ముంబై పోలీసులు నిర్ధారించారని, అక్రమ వలసదారులను ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుని, ఈ సంఘటనను మతపరంగా చూపించి హిందువులను కించపరిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్, టిఎంసి, ఐఎన్డిఐ కూటమిలోని ఇతర రాజకీయ పార్టీలు క్షమాపణ చెప్పాలి” అని ఇండియా కూటమి పార్టీలను లక్ష్యంగా చేసుకుని బిజెపి పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా డిమాండ్ చేశారు.
ఒక మతపరమైన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, బెంగాల్ బిజెపి యూనిట్ అధ్యక్షుడు, ఈశాన్య అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, “తల్లిదండ్రులు తమ పిల్లలు వైద్యులు లేదా ఇంజనీర్లు కావాలని కోరుకుంటారు. వారు ముందుగా మంచి హిందువులుగా మారాలి. మీ హిందూ గుర్తింపు అత్యంత ముఖ్యమైనది. ఆత్మరక్షణ కోసం ఇంట్లో పదునైన ఆయుధాన్ని ఉంచుకోండి. దీదీ (ముఖ్యమంత్రి మమతా బెనర్జీ) పోలీసులు మిమ్మల్ని ప్రమాదం నుండి రక్షించరు” అంటూ హెచ్చరించారు.
కాగా, విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన మహారాష్ట్ర సీఐడీ విభాగంలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు కేసు విచారణ కోసం ముంబయి పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే తరువాత పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది.
అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడం వల్ల అవి సైఫ్ అలీఖాన్‌వేనా, కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి