కాగా, విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన మహారాష్ట్ర సీఐడీ విభాగంలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు కేసు విచారణ కోసం ముంబయి పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే తరువాత పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది.
అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడం వల్ల అవి సైఫ్ అలీఖాన్‌వేనా, కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

More Stories
కేంద్ర మంత్రులు హర్దీప్ పూరీ, బిఎల్ వర్మలు దక్కని రాజ్యసభ సీట్లు
జ్ఞానేష్ కుమార్ సస్పెండ్ ఉత్తర్వులను సుప్రీం నిరాకరణ
అక్టోబర్ 7న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ