బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో బందిపొరా-కోరెన్జోడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు వైపుల నుంచి కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నారాయణపూర్ జిల్లాలో కూడా మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వారు నక్సల్స్‌కు సంబంధించిన బారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఈ మధ్యకాలంలో మావోయిస్టుల కోసం సెర్చింగ్‌ను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 4న బస్తర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 6న మావోయిస్టుల కోసం గాలిస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ ఘటనలో 8 మంది జవాన్లతోపాటు డ్రైవర్ మరణించారు.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవు
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా