గురుకులాలలో సౌకర్యాలను మెరుగుపరచకపోతే బిజెపి నిరసనలు

గురుకులాలలో సౌకర్యాలను మెరుగుపరచకపోతే బిజెపి నిరసనలు
తెలంగాణలోని గురుకులాలలో పరిస్థితులను చక్క దిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పిల్లల భవిష్యత్తును కాపాడాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు.  మీరు గురుకులాల లోనికి రాకుండా ఆపగలరేమో కానీ, గురుకులాలలో సౌకర్యాలని మెరుగుపరచక  పరిస్థితి ఇలాగే  ఉంటే రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాల ముందు బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
రాష్ట్రంలోని విద్యార్థుల ప్రభుత్వ వసతి గృహాలలో ప్రతిరోజు రాష్ట్రంలోఎక్కడో ఒకచోట గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం, ఉండడానికి కనీస సౌకర్యాలు లేకపోవడం రకరకాల  ఇబ్బందులు జరగడం వల్ల విద్యార్థుల చనిపోవడం, అనేక రకమైన ఇబ్బందులతో హాస్పిటల్లో చేరడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దానితో  వివిధ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు సందర్శించి అక్కడి ఇబ్బందులను ప్రభుత్వానికి, ప్రజల దృష్టికి గురుకులాలలో జరుగుతున్న లోపాలను జరుగుతున్న సంఘటనలు  బయట తెలియజేయడంతో ప్రభుత్వం భయపడి ఎవ్వరూ రాకుండా ఆంక్షలు విధిస్తూ ఉండటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
 అధికారుల నిర్లక్ష్యము బహిర్గతం కావడంతో గురుకులాల్లో జరుగుతున్న సంఘటనను ఏ విధంగా చక్కదిద్దాలని ఆలోచన మానేసి అక్కడ జరుగుతున్న విషయాలు మీడియా గానీ ప్రింట్ మీడియా గానీ తెలియకూడదు అని ఉద్దేశంతో గురుకులాలలో రాజకీయ పార్టీలు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని ప్రవేశించకూడదని బ్యానర్లు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దీనితో కాంగ్రెస్ నిరంకుశ ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించారు.  నిజంగా గురుకులాలలో సంఘటనలు  ఏమి జరగకపోతే ప్రభుత్వము ఇంత భయపడవలసిన విషయం లేదని ఆయన స్పష్టం చేశారు. గురుకులాలలో ఎవరు ప్రవేశించరాదని గురుకులాల ముందు బ్యానర్ల బ్యానర్ల ద్వారా నిషేధిస్తున్నాం ఎవరిని గురుకులాలలోనికి  రాకూడదని వస్తే చర్య తీసుకుంటామని హెచ్చరించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. 
 
ఇప్పటికైనా గురుకులాల్లో పరిస్థితులు చక్క దుద్ధి భోజనంతోపాటు కనీస సౌకర్యాలను మెరుగుపరచడానికి  ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ అక్కడి పరిస్థితి ఎవరికి తెలియకుండా పిల్లల భవిష్యత్తుతో ఆటలాడలను కోవడం సిగ్గుచేటు అవుతుందని మండిపడ్డారు.