సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతుకుతున్న గుత్తికోయ చిన్నారుల బతుకు చిత్రంపై తీసిన ‘రీచింగ్ ది అన్ రీచ్డ్’ షార్ట్ ఫిల్మ్‌కు అభివృద్ధి విభాగంలో ట్రోఫీ, నగదు బహుమతి, ధృవపత్రం లభించడం, మానవహక్కుల విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికవడం ఓయూకు గర్వకారణమని వీసీ అభిప్రాయపడ్డారు.
సామాజిక, అభివృద్ధి, విద్యా, ఆధునిక సాంకేతికత, పరిశోధనలు ఇతివృత్తంగా మరిన్ని లఘుచిత్రాలు రూపొందించాలని సూచించారు. అవార్డుతో పాటు వచ్చిన నగదు బహుమతి రూ.50 వేలను వీసీ చేతుల మీదుగా గుత్తి కోయ చిన్నారుల విద్యాభ్యాసం కోసం శ్రమిస్తున్న సంతోష్ ఇస్రం మిత్ర బృందానికి విరాళంగా అందజేశారు.
రఘుపతిరెడ్డి మాట్లాడుతూ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. మారుమూల గిరిజన విద్యార్థులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్‌నాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ ప్యాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్సన్, ప్రొఫెసర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

More Stories
హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు