 
                భారతీయ పౌరులకు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యుఏఈ) ‘వీసా ఆన్ అరైవల్’ వసతిని కల్పించింది. మామూలు పాస్ పోర్టు ఉన్న భారతీయులు కూడా ఇక అరబ్ ఎమిరేట్స్ కు వెళ్ళవచ్చు. అయితే కొన్ని షరతులు తప్పవు. యుఏఈ లో దిగినప్పటి నుంచి వారి పాస్ పోర్టు కనీసం ఆరు నెలలకు చెల్లుబాటు కలిగి ఉండాలి.
అంటే వ్యాలిడ్ పాస్ పోర్టు ఉండాలి. దరఖాస్తుదారుడికి అమెరికా, ఇంగ్లాండ్, లేక ఏ యూరొప్ దేశం గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెంట్ కార్డు, వ్యాలీడ్ వీసా కలిగి ఉండాలి. వీసా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి 14 రోజుల వీసా. దీనిక ఫీజు రూ. 2700 నుంచి రూ. 3400 వరకు ఉంటుంది. ఇక రెండో వీసా 64 రోజులది (దీనిని పొడగించడానికి వీలుండదు). దీనికి రూ. 24500 నుంచి రూ. 27000 వరకు ఖర్చవుతుంది. ఈ ఫీజును దిగగానే చెల్లించాల్సి ఉంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్ తో సంబంధాలను పెంచుకుంటోంది. 2023 నుంచి భారతీయ యాత్రికులు 25 శాతం పెరిగారు. ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ తో రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత పెరగొచ్చని భావిస్తున్నారు.ఎమిరేట్స్ కు వచ్చే భారతీయులకు యూరొప్, అమెరికా, ఇంగ్లాండ్ వీసాలు ఉండాలని భావించడం వెనుక దీర్ఘ కాలిక భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకున్నామని మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ తెలిపారు.





More Stories
చాబహార్ పోర్ట్పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు