సీట్టు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈ జీవోను నిలుపద చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూస్ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ వాదించారు.
పిటిషనర్ వాదనను అంగీకరించినా న్యాయస్థానం జీవోను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆరు వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఆరు వారాల తర్వాత హైకోర్టు దీనిపై తిరిగి పరిశీలన జరిపి తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. ఆలోపు ఈడబ్ల్యూఎస్ కోటా లేకుండా అడ్మిషన్లు చేయాల్సి ఉంటుంది.
ఈడబ్ల్యూఎస్ కోటాను కేంద్రం 2019లో ప్రవేశపెట్టింది. మొత్తం సీట్లలో పదిశాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీలుండగా వాటిలో ఐదారు కళాశాలల్లోనే కోటా అమలు చేస్తున్నారు. ఈ జీవో వల్ల యూజీలో 572, పీజీలో 180 సీట్లను ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోయే అవకాశముంది.

More Stories
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి… నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలి
వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు