అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నెంబర్ 217, 144 జీవోలు రద్దు చేసింది.
రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించాలని, అందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర ముద్రించాలని కేబినెట్ నిర్ణయించింది.
వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని కేబినెట్ అభిప్రాయపడింది. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని విమర్శలు వస్తున్నాయని మంత్రులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తొలగించి, కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ సూచించింది.

More Stories
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు
ఎస్ఐఆర్ లో నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి