
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసులు పురోగతి సాధించారు. దాదాపు మూడు రోజుల తర్వాత ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడు జగన్‌పై రాయితో దాడి చేసినట్టు గుర్తించారు.
అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడు ముఖ్యమంత్రిపై రాయి విసిరినట్టు గుర్తించారు. సతీష్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో నిందితుడితో పాటు ఉన్న ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్ అనే యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో పబ్లిక్‌లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించడం ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
శనివారం రాత్రి 8.04నిమిషాలకు డాబా కొట్ల సెంటర్లో ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేశారు. ఈ దాడిలో సిఎం జగన్‌తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి గాయాలయ్యాయి. విసురుగా వచ్చిన రాయి నేరుగా సిఎం జగన్‌ను నుదుటిపై తాకింది. రూఫ్‌టాప్ బస్సుపై ఉన్న సిఎంపై దాడి జరగడంపై విజయవాడ పోలీసులు దాదాపు 8 బృందాలతో దర్యాప్తు చేపట్టాయి.
బస్సు యాత్ర సాగిన ప్రాంతంలో మొబైల్ టవర్ డంప్‌లను విశ్లేషించారు. చీకట్లో తీసిన వీడియోలు మినహా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ చెబితే రెండు లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఫుట్‌పాత్‌లపై వేసే టైల్స్ ముక్కతో సిఎం జగన్‌పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.
నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్నారు. గత మూడ్రోజులు ముఖ్యమంత్రిపై దాడి వ్యవహారం ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటే, ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. శిరోమండనం కేసులో జైలు శిక్షలు ఖరారైన తర్వాత తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరైన తర్వాత విశాఖ నుండి మండపేట బయలుదేరారు. మండపేట నియోజవర్గంలో ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా త్రిమూర్తులు పోటీ చేయనున్నారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం