
కేజ్రీవాల్ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ మద్యం విధానం రూపొందించారని మండిపడ్డారు.
తన స్వలాభం కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసిందని హజారే పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ పరిస్థితి చూసి తను బాధగా అనిపించడం లేదని చెప్పారు. కేజ్రీవాల్ తన మాట వినలేదని అన్నా హజారే తెలిపారు.
“నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే విషయంపై పాలసీలు చేస్తుండటం బాధగా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్‌కు కారణం.. ఆయన చేసిన పనులే,” అని తెలిపారు అన్న హజారే.
అరవింద్ కేజ్రీవాల్ , సిసోడియాలు తనతో ఉన్నపుడు దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి ఎప్పుడూ చెప్పేవాడ్ని అని తెలిపారు. ఢిల్లీ నూతన మద్యం పాలసీ అంశంపై కేజ్రీవాల్‌కు రెండు సార్లు లేఖలు రాశానని,కానీ ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు తాను అతడికి ఎటువంటి సలహా ఇవ్వనని చెప్పారు.
అతడు తన మాట వినలేదని, కేజ్రీవాల్ పరిస్థితిని చూసి తాను బాధపడటం లేదని పేర్కొన్నారు. ఏది ఏమైనా చట్టం తనపని తాను చేస్తుంది అని తేల్చిచెప్పారు. కాగా, 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా అన్నా హజారా చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటంతో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్ 2012లో రాజకీయాల్లోకి వచ్చారు.
ఆమ్ ఆద్మీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. అయితే కేజ్రీవాల్ రాజకీయ ప్రవేశాన్ని హజారే వ్యతిరేకించారు. కేజ్రీవాల్.. రాజకీయ పార్టీ పెట్టడంపై అనేకమార్లు అసంతృప్తిని, అసహానన్ని వ్యక్తం చేశారు అన్న హజారే. మొదటిసారి 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసి 28 సీట్లు సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఏడాదిన్నరకే రాజీనామా చేయడంతో అసెంబ్లీ రద్దుయ్యింది. 2015లో భారీ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టారు. 2020లో ఢిల్లీ ఓటర్లు మరోసారి ఆప్‌ను ఆదరించారు.
More Stories
అన్ని మతాలను గౌరవిస్తాను
నేపాల్ ప్రధాని సుశీలా కర్కికి మద్దతు తెలిపిన మోదీ
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ