
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోని సెలబ్రిటీలకు లోక్‌సభ ఎంపీ టికెట్లు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన జాబితాలో నటి రాధికా శరత్ కుమార్‌కు టికెట్ ఇచ్చింది.
తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి రాధికా శరత్ కుమార్ లోక్‌సభ బరిలో నిలవనున్నారు. మొత్తం 15 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ. అందులో 14 తమిళనాడు నుంచి మరొక స్థానం పుదుచ్చేరి నుంచి వెలువరించింది. ఇటీవలే రాధిక భర్త పార్టీని బీజేపీలో విలీనం చేసింది.
విరుధ్ నగర్ నుంచి రాధికా శరత్ కుమార్ పోటీ చేయనుండగా, తిరువల్లూర్ నుంచి వీ.బాల గణపతి, చెన్నై నార్త్ నుంచి పాల్ కనగరాజ్, తిరువన్నామలై నుంచి అశ్వత్థామన, నమక్కల్ నుంచి కేపీ రామలింగం, తిరుప్పూర్ నుంచి ఏపీ మురుగానందం.. పొలాచ్చి నుంచి వసంతరాజన్, కరూర్ నుంచి సెంథిలినాథన్, చిదంబరం నుంచి కార్తియాయిని, నాగపట్టిణం నుంచి రమేష్‌కు బీజేపీ నాలుగో జాబితాలో పేరు కల్పించింది.
తంజావూరు నుంచి మురుగానందం, శివగంగా నుంచి దేవనాథన్ యాదవ్, మధురై నుంచి రామ శ్రీనివాసన్, టెంకాసన్ నుంచి జాన్ పాండియన్ బరిలో నిలవనున్నారు. ఇక పుదుచ్చేరి నుంచి ప్రకటించిన ఏకైక స్థానానికి పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నమశ్శివాయం పోటీ చేయనున్నారు.
తొలి విడతలో ఒకేసారి 195 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన ఆశ్చర్యపరిచిన బీజేపీ.. రెండో విడత జాబితాలో 72 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఇక మూడో జాబితాను గురువారం విడుదల చేసిన కమలం పార్ ఒక్క తమిళనాడు నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు చోటు కల్పించింది. చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమిళిసై పోటీ చేయనున్నారు.
More Stories
వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది
ఢిల్లీలో ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణం