
దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్ ఒ ప్రిన్స్ జైలు పైనా వీరు దాడులు చేశారు. జైలును బద్దలు కొట్టారు. వీరి దాడులతో ఆ జైల్లో ఉన్న వందలాది మంది నేరగాళ్లు తప్పించుకుని పారిపోయారు. ఈ పరిణామంతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయంతో వణికిపోతున్నారు. ఇళ్లను వదిలి పారిపోతున్నారు.
ఇప్పటికే దాదాపు 3,62,000 మంది వలసబాట పట్టారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.హైతీ ప్రజలు నిత్యం భయం గుప్పిట ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని, చాలా మంది ఇండ్లలో ఉండి తాళాలు వేసుకుంటున్నారని తెలిపింది. వీధివీధిలో సాయుధ దుండగులే కనిపిస్తున్నారని వెల్లడించింది.
పలు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లను ఆక్రమించేందుకు క్రిమినల్ గ్యాంగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక దవాఖానలు వీరి చేతుల్లోకి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి ఏరియెల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!