మళ్లీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ

మళ్లీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే పోటీ ప్రకటించారు. ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో 34 మంది మంత్రులు ఉన్నారు. 
 
ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. 2014లో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించి, 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై విజయం సాధించారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీ తన నివాసంలో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్‌డే వెల్లడించారు. 
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. వరుసగా ఇదే స్థానం నుంచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆయన భావిస్తున్నారు. 
 
తొలిసారిగా ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా లోక్‌సభ బరిలోకి దిగారు. అంతకు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. 2001లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ నియామకమయ్యారు. 2002, 2007, 2012లో నాలుసార్లు ముఖ్యమంత్రిగా రికార్డు విజయం సాధించారు. 
 
2013 లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకమయ్యారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. 2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ 371,784 ఓట్ల తేడాతో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై విజయం సాధించారు. మోదీకి 581,022 ఓట్లు, అరవింద్‌ కేజ్రీవాల్‌కు 2,09,238 ఓట్లు వచ్చాయి. 
 
2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ 4,79,505 ఓట్ల తేడాతో విజయం సమీప ప్రత్యర్థి అయిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై గెలుపొందార. ఈ ఎన్నికల్లో మోదీకి 6,74,664 ఓట్లు పోలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి షాలినికి 1,95,15 ఓట్లు వచ్చాయి.