సచివాలయంలో శుక్రవారం సిఎం రేవంత్‌రెడ్డితో వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫసల్‌బీమా పథకం సీఈవో కేంద్ర కార్యదర్శి రితేష్ చౌహన్ సమావేశమయ్యారు. ఫసల్‌బీమా పధకంపై చర్చించారు. వచ్చే పంటకాలం నుంచి ఈ పధకం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.
రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం కేంద్ర ప్రభుత్వ పథకాలకు, విధానాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్దికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సిఎం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

More Stories
మోదీ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనం
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం ధర్నా
కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం