2022లో ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అగ్రరాజ్యం అమెరికా కుట్రపన్నిందని ఆరోపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని ఆరోపణలు గుప్పించారు. ఇందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను ఆ ర్యాలీలో ప్రదర్శించారు.
అమెరికాలోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు తెలిపారు. దీంతో అధికారిక దౌత్య సమాచారానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేశ రహస్య చట్టాలను ఉల్లంఘించారని ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది.
ఈ మేరకు ఇరువురికీ పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ లో ఎన్నికలు జరగడానికి తొమ్మిది రోజుల ముందు ఈ జైలు శిక్ష విధించడం గమనార్హం. పిటిఐ అధికారిక ఎన్నికల గుర్తు లేకుండా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. మే 9న జరిగిన హింసాయుత సంఘటనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ ఇతరులకు శిక్షలు పడితే ప్రతిపక్ష పార్టీని నిషేధించే అవకాశం ఉందని ఎన్నికల గుర్తు లేకుండా పోటీ చేస్తున్నారు.

More Stories
ప్రత్యర్థులం కాదు, భాగస్వాములం.. భారత్-చైనా ఏకాభిప్రాయం’!
మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల బహుమతి!
యుకె నుండి స్వతంత్రం కోరుతున్న స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్